‘కాంతార చాప్టర్ 1’లో దిల్జిత్ పాట

TeluguCinema 13 Sep 2025
Diljit Dosanjh and Rishab Shetty

కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తీస్తున్న భారీ చిత్రం… “కాంతార చాప్టర్ 1”. ఈ సినిమా “కాంతార”కి ప్రీక్వెల్. ఈ సిరీస్లో రెండో చిత్రం. ఒరిజినల్ “కాంతార”లో “వరాహ రూపం” పాట సంచలనం సృష్టించింది. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇపుడు ఈసినిమా కోసం ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ తో పాట పాడించారు.

“బిగ్ బ్రదర్ రిషబ్ శెట్టి – మాస్టర్ పీస్ కాంతారను రూపొందించినందుకు సెల్యూట్. ఈ సినిమాతో నాకు వ్యక్తిగత అనుబంధం వుంది. వరాహ రూపం పాట థియేటర్లలో చూసినప్పుడు, ఆనందంతో ఏడ్చాను. అజనీష్ లోక్‌నాథ్‌కు కృతజ్ఞతలు. ఒక రోజులోనే తన నుంచి చాలా నేర్చుకున్నాను.” దిల్జిత్ దోసాంజ్ పోస్ట్ చేశారు. ఇప్పుడు తాను పాట పాడినట్లు తెలిపారు.

“కాంతారా చాప్టర్ 1” విజువల్‌ విజువల్ వండర్ గా ఉండబోతోంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. “కాంతారా చాప్టర్ 1” కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2, 2025న రిలీజ్ కానుంది.