
బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఒక సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా పాల్గొంటున్న సంజన గల్రానికి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు ఇచ్చింది. ఈ భామ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంది. రెండు నెలల తర్వా త బెయిల్ దరావటంతో బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆ డ్రగ్స్ కేసును కర్ణాటక హైకోర్టు కొట్టి వేసింది.
దాన్ని సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టుకు వెళ్ళింది కర్ణాటక ప్రభుత్వం. తాజాగా ఆ అప్పీల్ పై సుప్రీం కోర్టు సంజనకు నోటీసులు జారీ చేసింది. మళ్ళీ ఈ కేసులో ఆమె కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
బిగ్ బాస్ తెలుగు 9లో ఈ సారి ఇద్దరూ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఒకరు ఫ్లోరా సైనీ, మరొకరు సంజన. ఫ్లోరా అడల్ట్ ఆప్ లలో షోలు చేసింది. అలాంటి భామని తెచ్చింది బిగ్ బాస్ టీం. అలాగే డ్రగ్స్ కేసున్న సంజనని కూడా తీసుకున్నారు.
ALSO READ: Glam, Jail & Bigg Boss 9: The Story of Sanjjanaa Galrani
ప్రస్తుతం సంజన ఈ షోలో గట్టిగానే ఆడుతున్నారు.





