
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పూర్తిగా పవన్ కళ్యాణ్స్వీకరిస్తారనీ, ఇక 2026 తర్వాత ఆయన సినిమాలు ఒప్పుకోరని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అందుకే, “హరి హర వీర మల్లు”, “ఓజీ” సినిమాలను విడుదల చేశారని, మిగిలిన “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ కూడా స్పీడ్ గా పూర్తిచేసేశారని అన్నారు.
అవును, “ఉస్తాద్ భగత్ సింగ్”కి సంబంధించి పవన్ కళ్యాణ్ వర్క్ లేదు. అది పూర్తి అయింది. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తారు. సో, ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ కామా పెట్టి తన రాజకీయాలు, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.
ఐతే, తాజాగా పవన్ కళ్యాణ్ “ఓజీ 2” కూడా ఉంటుంది అని చెప్తున్నారట.
ఈ “ఓజీ 2″కి కూడా పవన్ కళ్యాణ్ త్వరలోనే కొబ్బరికాయ కొడుతారు అని టాక్ మొదలైంది. మరి సుజీత్ హడావిడిగా షూటింగ్ మొదలు పెడుతారా? లేక ఇదంతా సినిమా ప్రొమోషన్ కోసమా అనేది చూడాలి.
సినిమాలో “ఓజి 2” గురించి లింక్ ఉంది. కానీ అభిమానులు కూడా నిన్నటి వరకు రెండో భాగం గురించి ఎవరూ ఆలోచించలేదు. మరి సినిమాల కన్నా దేశం, రాజకీయం ముఖ్యం అన్న అలాంటోడు మరి తిరిగి వస్తాను అన్నాడంటే…!





