మృణాల్ కి ఈ ఏడాది జీరో

Mrunal Thakur

మృణాల్ ఠాకూర్ బిజీ హీరోయిన్. తెలుగులో వరుసగా నాలుగు సినిమాలు విడుదల చేసింది. ఐతే, ఈ ఏడాది మాత్రం ఆమెకి తెలుగులో ఒక్క సినిమా విడుదల అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది.

ఈ ఏడాది ఆమె హిందీలో ఒకే సినిమా చేసింది. అదే సన్నాఫ్ సర్దార్. కానీ అదే అపజయం పాలైంది. ఇక తెలుగులో క్రిస్మస్ కి విడుదల అయ్యే ‘డెకాయట్’ సినిమాతో 2025ని హిట్ తో ముగిద్దాం అనుకున్నది. కానీ ఆమె ప్లాన్ వర్కట్ కాలేదు.

‘డెకాయట్’ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమెకి తెలుగులో ఒక్క సినిమా విడుదల లేకుండా పోయింది. మొత్తంగా జీరో.

2026లో మాత్రం వచ్చే ఏడాది మూడు హిందీ సినిమాలు విడుదల అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కూడా ఆమె నటించనుంది.

More

 

Related Stories