
“ఇటీవల మిమ్మల్ని చికాకు పెట్టాను. కానీ మాస్ జాతర మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అభిమానులను అసలు నిరాశపర్చదు. ఇది నా ప్రామిస్ “
నిన్న జరిగిన “మాస్ జాతర” ఈవెంట్ లో రవితేజ తన అభిమానులకు ఇచ్చిన హామీ ఇది. “ఈగిల్”, “టైగర్ నాగేశ్వరరావు”, “రామారావు ఆన్ డ్యూటీ”, “మిస్టర్ బచ్చన్”… ఇలా వరుసగా రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో, ఈ సినిమా విషయంలో గట్టి ప్రామిస్ చేశాడు.
ఈ ఈవెంట్ కి తమిళ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. సూర్య ముందు రవితేజ తన సినిమా గురించి ప్రామిస్ చేశాడు కాబట్టి అభిమానులకు ఇప్పుడు నమ్మకం పెరిగింది. నిజానికి “మాస్ జాతర”కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్ పెద్దగా ఎక్కలేదు.
ఒక్క పాట పాపులర్ అయింది కానీ అందులోని సాహిత్యంపై విమర్శలు వచ్చాయి. ట్రైలర్ చూస్తే పక్కా రొటీన్ మాస్ మూవీ అనిపిస్తోంది. కానీ ఈ సినిమా గురించి రవితేజ అంతగా ప్రామిస్ చేస్తున్నారంటే ఇప్పుడు కొంచెం ఆశలు పెట్టుకోవచ్చు.





