
అదా శర్మ ఆ మధ్య బాలీవుడ్ లో ఒక సినిమా చేసి బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తల మద్దతు ఆమెకి బాగా దక్కింది. ఆ సినిమా పేరు “ది కేరళ స్టోరీ.” 2023లో విడుదలైన ఆ చిత్రం భారీ విజయం సాధించింది.
తెలుగులో “హార్ట్ అటాక్”, “క్షణం”, “సన్నాఫ్ సత్యమూర్తి,” “గరం” వంటి సినిమాలతో కూడా పాపులర్ అయింది. కానీ తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన “కల్కి”లో కనిపించిన తర్వాత క్రేజ్ పోయింది. దాంతో ఆమె బాలీవుడ్ లో “ది కేరళ స్టోరీ”లో నటించి మళ్ళీ కెరీర్ ని ట్రాక్ లో పెట్టింది.
ఆ తర్వాత “బస్తర్” సినిమాలో నటించింది. ఇటు “ది కేరళ స్టోరీ”, అటు “బస్తర్” రెండూ వివాదాలు సృష్టించాయి. కానీ ఆమెకి బాగా క్రేజ్ తెచ్చాయి. ఆమె కేరీర్ ని మలుపు తిప్పాయి.
ఐతే ఈ రెండు సినిమాలు విడుదలైనప్పుడు తనని కొంతమంది చంపాలని ప్రయత్నించారు అని అదా శర్మ చెప్తున్నారు.
“ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేందుకు రెక్కీ కూడా చేసినట్లు సమాచారం ఉంది,” అని ఆమె తెలిపారు





