రారాజుగా బాలకృష్ణ!

NBK111

ఇప్పుడు తెలుగు సినిమా అంతా రాజుల కాలం కథలు, పౌరాణిక గాథలు, లోకాలు, ముల్లోకాలు తిరిగే వీరుల పాత్రలు. రాజమౌళి చిత్రంలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నాడు. త్రివిక్రమ్ తీసే పౌరాణిక చిత్రంలో కార్తికేయ సుబ్రమణ్య స్వామిగా ఎన్టీఆర్ దర్శనమిస్తాడు. అట్లీ తీస్తున్న సినిమాలో ముల్లోకాలలో తిరిగే వీరుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. ప్రభాస్ ఇప్పటికే “కల్కి”లో కర్ణుడిగా కనిపించాడు.

ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ రారాజుగా, వీరుడిగా కనిపించనున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తీసే చారిత్రక చిత్రంలో బాలయ్య ఇలా రాజుగా కనిపిస్తారు.

ఈ రోజు సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య యుద్ధం చేస్తున్న రాజుగా కనిపించారు.

బాలయ్య గతంలో రాజుగా నటించారు. పౌరాణిక పాత్రలు పోషించారు. 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి తరువాత మళ్ళీ ఆయన ఈ తరహా పాత్రలో కనిపిస్తున్నారు. ఇది బాలయ్యకి 111వ చిత్రం.

More

 

Related Stories