సల్మాన్ ఖాన్ తో పైడిపల్లి సెట్

Salman Khan and Vamshi Paidipalli

ఒకప్పుడు అగ్రస్థాయి తెలుగు దర్శకుల లిస్ట్ లో వంశీ పైడిపల్లి పేరు ఉండేది. కానీ ఆయన మాస్, యాక్షన్ సినిమాలు వదిలి వేరే రకమైన సినిమాలు చెయ్యడం మొదలుపెట్టి సినిమా సినిమాకి గ్యాప్ పెంచుకుంటూ వెళ్తున్నారు. దాంతో తెలుగు పెద్ద హీరోల కాంబినేషన్ లిస్ట్ లో పైడిపల్లి పేరు ఇప్పుడు వినపడడం లేదు. మహేష్ బాబుతో “మహర్షి” తీసిన చాలా గ్యాప్ తర్వాత తమిళ స్టార్ విజయ్ తో “వరిసు” తీశారు. ఆ తర్వాత గ్యాప్ మరింతగా పెరిగిపోయింది.

ఇప్పుడు తెలుగు వదిలి, తమిళ్ వదిలి, బాలీవుడ్ లో ల్యాండ్ అయ్యారు. మొదట అమీర్ ఖాన్ తో ఒక మూవీ అనుకున్నా అది వర్కట్ కాలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నట్లు సమాచారం.

గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న దిల్ రాజు, శిరీష్ ఈ విషయాన్ని తెలిపారు. సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి సినిమాకి ఓకే చెప్పినట్లు వారు చెప్పారు.

సల్మాన్ ఖాన్ ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన “గాడ్ ఫాదర్” సినిమాలో నటించారు. కానీ పైడిపల్లి తీసే సినిమా పూర్తిగా హిందీ చిత్రం.

సో, సల్మాన్ ఖాన్ సౌత్ దర్శకులతో సినిమాలకు బ్రేక్ ఇవ్వడం లేదు అన్నమాట. ఆ మధ్య తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన “సికిందర్” ఘోరంగా పరాజయం పాలు కావడంతో సల్మాన్ ఖాన్ ఇక దక్షిణాది దర్శకులతో సినిమాలు చెయ్యడం మానేస్తాడని పుకార్లు వినిపించాయి. అది నిజం కాదని పైడిపల్లి నిరూపించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

More

 

Related Stories