
మృణాల్ ఠాకూర్ ఇటీవల తాను నటిస్తున్న సినిమాల కన్నా ఎక్కువగా వ్యక్తిగత జీవితం గురించి వార్తల్లో నిలిచింది. ఆమె ప్రేమాయణాలు హెడ్ లైన్స్ అయ్యాయి. ముందుగా తమిళ స్టార్ ధనుష్ తో ఆమె డేటింగ్ చేస్తోందన్న ప్రచారం బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఒక క్రికెటర్ తో లింక్ పెట్టారు.
ఈ వార్తల గురించి ఆమె తాజాగా స్పందించింది. “ఇలాంటి వార్తలు మంచిదే. ఉచితంగా నిత్యం వార్తల్లో ఉంటున్నాను. డబ్బులేకుండా పబ్లిసిటీ వస్తోంది,” అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
ధనుష్, మృణాల్ గురించి ఇటీవల ఎక్కువగా గాసిప్స్ వచ్చాయి. ఇద్దరూ ఒకరి సినిమా గురించి మరొకరు ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్లు పెట్టుకోవడం, ఆమె సినిమాల ప్రీమియర్ షోలకు ధనుష్ అటెండ్ కావడం, ధనుష్ సోదరీమణులు మృణాల్ ని సడెన్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో కావడం వంటివి ఇటీవల చోటు చేసుకున్నాయి. దాంతో వీరి మధ్య రిలేషన్ షిప్ గురించి ప్రచారం జోరుగా సాగింది.
ALSO CHECK: Mrunal Thakur turns heads in a curve-defining gown
క్రికెటర్ తో కూడా లింక్ పెడుతూ వార్తలు వచ్చినా ధనుష్ తో డేటింగ్ అనేది గట్టిగా సాగింది.
ప్రస్తుతం ఈ భామ మూడు సినిమాల్లో నటిస్తోంది. అవన్నీ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. తెలుగులో డెకాయిట్, హిందీలో “దో దీవానే షహర్ మే”, ఇక పాన్ ఇండియా చిత్రం అల్లు అర్జున్ -అట్లీ… ఇవి ఆమె ఖాతాలో ఉన్నాయి.





