
సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్తున్నారు. కిడ్నీ సంబంధిత చెకప్ కోసం ఆయన అర్జెంట్ గా అమెరికా పయనం ఫిక్స్ చేసుకున్నారు. ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లేందుకు రజినీకాంత్ కి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కొవిడ్ 19 రెండో వేవ్ కారణంగా విమాన ప్రయాణాలకు అనుమతి లేదు.
అత్యవసర ప్రయాణాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి తీసుకొని వెళ్లొచ్చు. మొత్తం కుటుంబ సభ్యులందరూ అమెరికా వెళ్లనున్నారు ఈ స్పెషల్ ఫ్లైట్ లో.
2016లో అమెరికాలోని ఒక పేరొందిన ఆసుపత్రిలోనే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు రజినీకాంత్. తనకు రెనాల్ ట్రాన్స్ ప్లాంట్ జరిగిన మాట వాస్తవమే అని ఇటీవలే రజినీకాంత్ మీడియాకి తెలిపారు. తనకున్న ‘సున్నితమైన’ ఆరోగ్య స్థితి కారణంగానే రాజకీయ పార్టీ పెట్టొద్దని నిర్ణయించుకున్నట్లు రజినీకాంత్ చెప్పారు.
ఇప్పుడు మరోసారి చెకప్ చేయించుకోవాలిట. ఈ కారణంగానే రజినీకాంత్ రీసెంట్ గా హైదరాబాద్ లోని ఫిలిం సిటీలో హడావిడిగా ‘అన్నత్థే’ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేశారు. మరో కొత్త సినిమా ఒప్పుకోలేదు.





