సమంత అటువైపే చూపు వేస్తోందా?

TeluguCinema 12 Sep 2021
samantha sep

ఇక బాలీవుడ్ లో ఎంట్రీకి అంతా సిద్ధమైంది. సమంత త్వరలోనే ఒక బాలీవుడ్ మూవీని సైన్ చేయనుందట. ఇంతకుముందు ఆమెకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ ఆమె అప్పుడు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఆమె సై అంటున్నట్లు సమాచారం.

‘ది ఫ్యామిలీ మేన్ 2’ వల్ల సమంతకి హిందీ చిత్ర రంగంలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. దానికితోడు, ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ దక్షిణాది తారలపై చూపు వేశారు. షారుక్ కాన్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో రూపొందే సినిమాలో నయనతార హీరోయిన్. నయనతార కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో సమంత కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు టాక్.

ప్రస్తుతం సమంత ఖాళీగానే ఉంది. తెలుగులో ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ ఆమె ఒక మూవీ చేస్తోంది. ఆ షూటింగ్ పూర్తి అయింది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్న మూవీలో కూడా సమంత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. అంటే, సమంత ఇప్పుడు బాలీవుడు చిత్రాలకు టైం కేటాయించే ఛాన్స్ ఉంది.

samantha stills 09092100001

సమంత ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో తన పెంపుడు కుక్కలకి సంభిందించిన పోస్టులు ఎక్కువగా పెడుతోంది. కొత్త సినిమాల గురించి ఇంకా ఆమె నుంచి క్లారిటీ రాలేదు.

.