2 మిలియన్ చేరువలో పుష్ప

- Advertisement -
Pushpa


‘పుష్ప’ అమెరికాలో మంచి వసూళ్లు సాధిస్తోంది. దాదాపుగా ఏ వెబ్ సైట్ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వలేదు. అయినా, ఈ సినిమా 2 మిలియన్ల మార్క్ కి చేరుకొంది. వీక్ డేస్ లో కూడా వీక్ అవలేదు. ఈ సినిమా 2 మిలియన్ల మార్క్ దాటేయ్యెటానికి రెడీగా ఉంది.

ఈ సినిమా లాభాలు తీసుకురావాలంటే 2.4 మిలియన్ల మార్క్ దాటాలి. ఈ ఊపు చూస్తుంటే లాభనష్టాలు లేని దశకు చేరుకొంటుంది. ఏ విధంగా చూసినా అల్లు అర్జున్ తన సత్తా చూపాడని చెప్పొచ్చు.

కరోనా వేవ్ మొదలైన తర్వాత ఇంతవరకు ఏ ఇండియన్ మూవీ కూడా రెండు మిలియన్ల మార్కు అందుకోలేదు. దీన్ని బట్టి చెప్పొచ్చు ‘పుష్ప’ అమెరికాలో మంచి విజయం సాధించింది అని.

సినిమా ఇంకా పక్కా ప్లానింగ్ తో రిలీజ్ అయి ఉంటే మరింత ఎక్కువ అమౌంట్ ప్రీమియర్ షోలతోనే వచ్చేది.

 

More

Related Stories