
ఇప్పటికే ఓవర్సీస్ లో పవన్ కల్యాణ్ సినిమా టికెట్ రేటు రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. ఆ మొత్తాన్ని జనసేన పార్టీ ఎకౌంట్ కు ట్రాన్సఫర్ చేశాడు సదరు వీరాభిమాని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతు వచ్చింది.
తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి “ఓజీ”కి లైన్ క్లియర్ అయింది. స్పెషల్ జీవోలు వచ్చేశాయి. సెన్సార్ సర్టిఫికేట్ చేతికిరాగానే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అంతలోనే ఈ సినిమా టికెట్ లక్ష రూపాయలకు అమ్ముడుపోయింది.
చిత్తూరు జిల్లా రాఘవ్ థియేటర్ లో “ఓజీ” సినిమా టికెట్ ను లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు పవన్ అభిమాని శ్రీరామ్. ఆ మేరకు లక్ష రూపాయల చెక్కును జనసేన పార్టీకి అందజేశాడు. గ్రామ అభివృద్ధికి ఆ డబ్బు వెచ్చించాలని సూచించాడు.
“ఓజీ”పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించాడు.





