ప్రభాస్ తో దిశా హాట్ సాంగ్!

- Advertisement -
Kalki 2898 AD set

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తోన్న భారీ చిత్రం… “కల్కి 2898 AD”. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. ఇక మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. మరో హీరోయిన్ గా దిశా పటాని నటిస్తోంది.

ప్రభాస్, దిశాలపై ఒక హాట్ హాట్ పాట తీయనున్నారు. ఈ పాట షూటింగ్ కోసం టీం అంతా ఇటలీ వెళ్ళింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీ పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్ లో పాటని చాలా గ్రాండియర్ చిత్రీకరించనున్నారు.

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ (“దసరా” “కబాలి” ఫేమ్) స్వరపరిచిన రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాటని అండర్ వాటర్, బీచ్ నేపథ్యంగా హీరో, హీరోయిన్ పై తీయనున్నారు.

దిశాకి గ్లామర్ భామగా పేరుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ నిండా ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ ఫొటోలే దర్శనమిస్తాయి. ఆమె అందాల ఆరబోతకు అస్సలు వెనుకాడదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ హాట్ హాట్ పాటలో ఎంత హాట్ గా కనిపిస్తుందో.

Disha Patani

ALSO READ: Kalki 2898 AD’s team moves to Naples for a song shoot

వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న “కల్కి 2898 AD” మే 9, 2024న విడుదల కానుంది.

 

More

Related Stories