
ఇటీవల విడుదలైన రెండో భాగం చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఓదెల-2, డబుల్ ఇస్మార్ట్, లూసిఫర్-2, వార్ 2… ఇలా లిస్ట్ పెద్దదే. ఇలాంటి సమయంలో ఈ ఏడాది రెండు భారీ సీక్వెల్స్ వస్తున్నాయి.
ముందుగా విడుదల కానుంది… కాంతార చాప్టర్ 1. ఇది “కాంతార” సినిమాకి ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2 కానుంది. “కాంతార” తెలుగులో భారీ విజయం సాధించింది. సో, ఈ ప్రీక్వెల్ కి కూడా మంచి క్రేజ్ ఉంది.
ఇక అఖండ-2 ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగా జరగనుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఇంతవరకు ఫెయిల్ అవలేదు. ఐతే, ఈ రెండో పార్ట్ ఎంతవరకు జనాల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.
ALSO READ: Rukmini Vasanth’s dream run with Pan-Indian biggies
ఈ రెండు సినిమాలు రెండో భాగం ట్రెండ్ కి మళ్ళీ ఊపు తెస్తాయా?





