భాగ్య ఆశలన్నీ ‘కింగ్’ పైనే

Bhagyashri Borse

భాగ్యశ్రీ బోర్స్ అందం మామూలుగా ఉండదు. కట్టిపడేసే ఆమె బ్యూటీని చూసి మన తెలుగు దర్శక, నిర్మాతలు ఏమి ఆలోచించకుండా టకటకామని ఆమెకి ఆఫర్స్ ఇచ్చారు. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే మూడు కొత్త సినిమాల షూటింగులు ఆమె హీరోయిన్ గా మొదలుపెట్టారు.

కానీ ఆమె మొదటి చిత్రం “మిస్టర్ బచ్చన్” ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన రెండో చిత్రం “కింగ్డమ్” కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది. ఇక ఆమె మూడో చిత్రం “కాంత” (దుల్కర్ సల్మాన్ హీరో) ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదాపడింది. నాలుగో చిత్రంగా విడుదల కావాల్సిన “ఆంధ్రా కింగ్ తాలూకా” ఇప్పుడు ఆమెకి మూడో చిత్రంగా మారింది.

రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న “ఆంధ్రా కింగ్ తాలూకా”పైనే ఆమె ఆశలన్నీ.

ఈ సినిమా ఆడితేనే ఆమెకి కొత్తగా మళ్ళీ సినిమాలు దక్కుతాయి. లేదంటే ఆమెకి మరో అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి.

అన్నట్లు “ఆంధ్రా కింగ్ తాలూకా” సినిమాలో రామ్ తో ఆమె కెమిస్ట్రీ బాగా పండింది అని టాక్. ఈ సినిమాలోని మొదటి పాట అందుకే బాగా క్లిక్ అయింది.

More

 

Related Stories