టీవీ సీరియల్లో బిల్ గేట్స్

Bill Gates makes a cameo in Kyunki Saas Bhi Kabhi Bahu Thi


బిల్ గేట్స్ గురించి పరిచయం అక్కర్లేదు. మైక్రోసాప్ట్ ని స్థాపించి కంప్యూటర్ రంగాన్ని మార్చేసిన వ్యాపారవేత్త ఆయన. బిల్ గేట్స్ తాజాగా ఒక టీవీ సీరియల్లో కనిపించారు. అదీ కూడా ఒక హిందీ సీరియల్లో.

క్యూన్కి సాస్ భి కభీ బహు థి” (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియల్ లో తులసి పాత్ర బిల్ గేట్స్ తో జూమ్ కాల్ చేస్తుంది. ఆ సీన్ ని ఈ రోజు ప్రసారం చేశారు.

బిల్ గేట్స్ ఒక టీవీ సీరియల్లో నటించడం ఇదే ఫస్ట్ టైం.

ఈ సీరియల్లో తులసిగా స్మృతి ఇరానీ నటించి పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ అదే పాత్రలో ఆమె నటించడం మొదలుపెట్టారు. ఆమెతో బిల్ గేట్స్ ముచ్చటించిన ఈ సీన్ ఇప్పుడు సెన్సేషన్ అయింది.

బిల్ గేట్స్ కి ఇండియా అంటే ఇష్టం. మన సినిమాలు, మన సెలెబ్రిటిలు, రాజకీయనాయకులు తెలుసు.

More

 

Related Stories