ఇంకో ఆఫర్ ఇచ్చిన గీత!


‘బొమ్మరిల్లు’ భాస్కర్ కి చాలా గ్యాప్ తర్వాత ఒక మూవీ అవకాశం వచ్చింది. అదే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే నటించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఐతే, ఈ సినిమా నిర్మాణం ఒక ప్రహసనం.

భాస్కర్ తీసిన సినిమా నిర్మాతలకు నచ్చలేదు. చాలా సీన్లు రీషూట్ చేయించారు. ఆ తర్వాత హీరో ఫాదర్ నాగార్జున ఎడిటింగ్ లో కొన్ని మార్పులు చెప్పారు. రెండున్నరేళ్ళ పాటు సాగింది నిర్మాణం. వారు అందరూ కలిసి చేసిన మార్పులు చేర్పుల వల్లే ఆడింది అని అంటున్నారు. అందుకే, ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “సినిమా మేకింగ్ లో భాస్కర్ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టాం. కానీ అనుకున్నది సాధించావు,” అని చెప్పారు బన్ని. షూట్లు, రీషూట్లు గురించే ఇన్ డైరెక్ట్ గా చెప్పారు అల్లు అర్జున్.

ఐతే, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే అన్ని సర్దుకుంటాయి. ఇప్పుడు అదే సంస్థ భాస్కర్ కి మరో అఫర్ ఇచ్చిందట. ఇంకో యువ హీరోకి సెట్ అయ్యే కథని రెడీ చేసుకోమని చెప్పింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో భాస్కర్ కి ఇప్పుడు ఇంకో ఛాన్స్ వచ్చింది. మరి ఈ సారి అయినా కన్ఫ్యూజ్ కాకుండా స్పీడ్ గా సినిమా చేస్తాడా అన్నది చూడాలి.

‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ తప్ప భాస్కర్ తీసిన ఇతర సినిమాలన్నీ ఢమాల్ అనిపించుకున్నాయి. ఈ సక్సెస్ అతనికి కొత్త ఉత్సాహం ఇచ్చింది.

Advertisement
 

More

Related Stories