మెగాస్టార్ శ్రీముఖి రొమాన్స్ వర్కవుటయ్యేనా?

శ్రీముఖికి బంపర్ అఫర్ దక్కింది. ఆమెకి ఒక బడా చిత్రంలో ఛాన్స్ వచ్చింది. అదే మెగాస్టార్ చిరంజీవి మూవీ.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ని సెపరేట్ గా పెడుతున్నారు. అందులో భాగంగా ‘ఖుషి’ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య చిత్రీకరించిన నడుము సీన్ మెగాస్టార్, శ్రీముఖిపై తీస్తున్నారట. ఇలాంటి స్పూఫ్ సీన్లు వర్కవుట్ అవుతాయిని భావన.

ఇటీవల చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’లో ఆయన చేసిన కామెడీ, జారు మీటాయా అంటూ చేసిన వీరంగం జనాలకు నచ్చింది.

దాంతో, ‘భోళా శంకర్’లో కూడా అలాంటివి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగమే శ్రీముఖి-చిరంజీవి సరసం.

Sreemukhi and Chiranjeevi

ప్రస్తుతం శ్రీముఖికి పెద్దగా సినిమాల్లో అవకాశాలు లేవు. ఆమె నటించిన చిత్రాలేవీ ఇంతవరకు విజయం సాధించలేదు. అందుకే, ఆమె సినిమా రంగంలో రాణించలేకపోయింది. బుల్లితెరపైనే టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.

 

More

Related Stories