ఫ్లాపులు ఇచ్చినా అవకాశాలు!

Saiee Manjrekar

సయీ మంజ్రేకర్ ఇప్పటికే మూడు తెలుగు సినిమాల్లో, ఒక బాలీవుడ్ చిత్రంలో నటించింది. అందులో ఒక్కటే ఆడింది. మిగతావి ఆడలేదు. అయినా ఆమెకి తెలుగులో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

సయీ మంజ్రేకర్ …ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు. ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్ 3’లో నటించింది. అదే ఆమెకి మొదటి సినిమా. కానీ అది ఆడలేదు. దాంతో బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. ఆ వెంటనే తెలుగుకి షిఫ్ట్ అయింది. అలా ఆమె తెలుగులో ‘గని’ అనే చిత్రంతో అడుగుపెట్టింది. అది ఫ్లాప్. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘మేజర్’ చిత్రంలో నటించింది. ఇది తెలుగులోనూ, హిందీలోనూ విజయం సాధించింది.

ఇక రీసెంట్ గా బోయపాటి తీసిన “స్కంద” చిత్రంలో రెండో హీరోయిన్ గా మెరిసింది. కానీ, ఈ సినిమా కూడా ఆడలేదు. మొత్తంగా హిందీ, తెలుగులో కలిపి నాలుగు చిత్రాలు చేస్తే మూడు ఫ్లాప్ అయ్యాయి.

లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న కళ్యాణ్ రామ్ 21వ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి కూడా హాజరైంది. తెలుగులో ఆమె కెరీర్ బాగానే ఉంది.

Advertisement
 

More

Related Stories