- Advertisement -

ప్రముఖ సింగర్ గీతా మాధురి మరోసారి తల్లి కాబోతున్నారు. 2019లో ఆమె, ఆమె భర్త నందుకు కూతురు పుట్టింది. ఇప్పుడు మరోసారి ఆమె మాతృత్వపు మధురిమలు ఆస్వాదించనున్నారు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు.
ఆమె హీరో నందుని పెళ్లాడింది. నందు, తన కూతురు దాక్షాయణితో కలిసి ఉన్న ఫోటోని గీతా మాధురి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. “వచ్చే ఫిబ్రవరిలో దాక్షాయని అక్క కాబోతుంద,”ని ఆమె ఫోటోకి క్యాప్షన్ రాశారు. అంటే ఆమె ఇప్పుడు ఆరు నెలల గర్భవతి అని చెప్పకనే చెప్పారు.
గీతా మాధురికి సింగర్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకి 15 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.