
మా ఎన్నికల్లో కొన్ని కామెడీ ప్రహసనాలు కూడా చోటుచేసుకున్నాయి. అందులో హేమ – శివబాలాజీ కొరుకుడు సంఘటన ఒకటి.
నటుడు శివబాలాజీ చేతిని నటి హేమ కొరికారు. ఈ విషయాన్ని నరేష్ బయటపెట్టారు. శివబాలాజీ చేతిపై ఉన్న గుర్తును మీడియాకు చూపించారు. జరిగిన ఘటనపై శివబాలాజీ సిగ్గుపడుతూ లోపలికి వెళ్లిపోయాడు.
హేమ నన్ను ఎందుకు కొరికిందో తెలీదు
ఎవరో బయటి వ్యక్తి వచ్చి ప్రచారం చేస్తున్నాడు. అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ పారిపోయాడు. ఇంతలో మనుషులు మీద పడుతున్నారని నేను రెండు చేతులతో రెండు పోల్స్ పట్టుకున్నాను. హేమ గారు ఎందుకు కొరికారో నాకు తెలీదు.
ఆయనేదో చేశాడు.. అందుకే కొరికేశా: హేమ
ఆయనేం చేయకుండానే నేను కొరికి రక్కేస్తానా? ఆయన నన్ను ఏదో చేయబోయాడు. అందుకే నేను చేయి కొరకాల్సి వచ్చింది. నాకు అడ్డంగా ఆయన చేయి పెట్టాడు.





