మాల్దీవుల్లో హీరోయిన్లు

Mehreen

ఒకప్పట్లా సేదతీరడానికి అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్లడం లేదు మన హీరోయిన్లు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చాలా దేశాల్లో కరోనా సెకెండ్ వేవ్ స్టార్ట్ అయింది. అందుకే రిలాక్స్ అయ్యేందుకు ఇప్పుడు చాలామంది మాల్దీవుల్ని సెలక్ట్ చేసుకుంటున్నారు.

మొన్నటికిమొన్న తాప్సి మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. దాదాపు 4 రోజుల పాటు దీవుల్లో రిలాక్స్ అయిన ఈ రింగులజుట్టు పాప.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు స్టార్ట్ చేస్తోంది.

అటు మెహ్రీన్ అయితే ఏకంగా మాల్దీవుల్లో కాపురం పెట్టేసింది. వారం రోజులుగా ఆమె అక్కడే ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా తన పుట్టినరోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంది. పేరెంట్స్ తో కలిసి మాల్దీవుల్లో ఉన్న మెహ్రీన్.. ఇప్పటికిప్పుడు వెంటనే స్టార్ట్ చేయాల్సిన సినిమాల్లేవు. అందుకే ఆమె ఇలా ఛిల్ అవుతోంది.

మరోవైపు కాజల్ కూడా తన హనీమూన్ కోసం మాల్దీవులనే సెలక్ట్ చేసుకుంది. భర్త గౌతమ్ తో కలిసి ఓ ప్రైవేట్ ఐలాండ్ లో ల్యాండ్ అయిన కాజల్.. అక్కడ్నుంచి రెగ్యులర్ గా ఫొటోలు అప్ లోడ్ చేస్తోంది. ప్రస్తుతం కాజల్ దిగిన దీవి, మాల్దీవుల్లో ఖరీదైన ఐలాండ్ అంట.

ఇలా హీరోయిన్లంతా ఛలో మాల్దీవులు అంటున్నారు. త్వరలోనే ఈ లిస్ట్ లోకి ఇంకెంతమంది ముద్దుగుమ్మలు చేరుతారో చూడాలి. త్వరలోనే వెకేషన్ కు వెళ్తామని తమన్న, పూజా హెగ్డే, శృతిహాసన్ లాంటి తారలు ప్రకటించారు. వీళ్లు ఎక్కడ ప్రత్యక్షమౌతారో చూడాలి. 

Related Stories