బాలయ్యకి ఈ టైటిల్ బాగుంటుంది!

Balakrishna in BB3

బలరామయ్య బరిలో దిగితే!
మంచి ఫోర్స్ ఉన్న టైటిల్ ఇది. ఈ నేమ్ నందమూరి బాలకృష్ణకి బాగా సూటయ్యేదే. మరి ఈ టైటిల్ కి, ఈ కథకి బాలయ్య ఓకే చెప్తాడా? బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఏమి సినిమా చెయ్యాలి అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మునుపటిలా ఒకేసారి రెండు, మూడు సినిమాలు ఓకే చెయ్యడం లేదు బాలయ్య. స్లో అండ్ స్టడీ అంటున్నాడు.

ఇప్పుడు “బలరామయ్య బరిలో దిగితే!” సంగతి ఏంటంటే… ఈ టైటిల్, ఈ కథతో దర్శకుడు సంతోష్ శ్రీనివా బాలయ్యని అప్రోచ్ అయ్యాడట. ఇటీవలే బెల్లంకొండ హీరోగా సంతోష్ శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్” అనే సినిమాని పూర్తిచేశాడు. అది విడుదల డేట్ కోసం చూస్తోంది. ఈ గ్యాప్ లో బాలయ్య కోసం ఈ కథ రెడీ చేశాడట.

నందమూరి బాలకృష్ణ ఇంతకుముందు పూరితో ఒక మూవీ అనుకున్నాడు కానీ దానికి ఇంకా టైం పట్టేలా ఉంది.

Advertisement
 

More

Related Stories