పంతం నెగ్గించుకున్న వరుణ్ తేజ్

- Advertisement -

వరుణ్ తేజ్ అనుకున్నది చేశాడు. నేను ఈ సినిమా చెయ్యలేను అని ఫీలర్లు వదిలి నిర్మాత దిల్ రాజుకి టెన్షన్ పెట్టి తనకి కావాల్సింది సాధించుకున్నాడు ఈ యువ మెగా హీరో. ఇదంతా “ఎఫ్ 3” సినిమా గురించే.

వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించాలంటే పారితోషికం పెంచాలని అన్నాడు. ఎందుకంటే “ఎఫ్ 2” సినిమాకి చాలా తక్కువ మొత్తం వచ్చింది. ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు వరుణ్ తేజ్ మార్కెట్ తక్కువే. కానీ సినిమా భారీ హిట్టయి నిర్మాత దిల్ రాజుకి 32 కోట్ల రూపాయల (అన్ని ఖర్చులు, టాక్సలు పోను) లాభం వచ్చింది. ఇక “ఎఫ్ 3″కి రిలీజ్ కి ముందే కళ్ళు చెదిరే బిజినెస్ అవుతుంది. అలాంటపుడు తాను ఎందుకు భారీ పారితోషికం తీసుకోవద్దు అనుకున్నాడు వరుణ్ తేజ్.

వెంకటేష్ కి సమానంగా తనకి ఇవ్వాలని పట్టుబట్టాడట. మొదట దిల్ రాజు నిరాకరించాడు. ఫైనల్ గా వరుణ్ తేజ్ మాటే నెగ్గింది అనేది టాక్. ఎందుకంటే, ఈ సీక్వెల్ ని వెంకటేష్, వరుణ్ తేజ్ లేకుండా చెయ్యలేరు. ఆ పాయింట్ మీద వరుణ్ అనుకున్నది సాధించాడు.

మొత్తానికి ఈ సినిమాకి అందరికి పారితోషికాలను పెంచాడు దిల్ రాజు. వెంకటేష్ కి, వరుణ్ తేజ్ కి, దర్శకుడు అనిల్ రావిపూడికి చెరో పది కోట్లపైనే ముట్టనుంది.

 

More

Related Stories