జయప్రద, జీవిత…అంతా సైలెంట్!

- Advertisement -
Jeevitha and Jayasudha

మూడు, నాలుగు నెలల క్రితం వరకు కూడా చాలామంది హీరోయిన్లు, నటులు బీజేపీ వైపు చూపు వేశారు. పోటీ చేస్తామని హడావిడి చేశారు. అందులో ముందున్న నటి … జీవిత. “హైదరాబాద్ పబ్బు ఓనర్లు అందరూ ఆమె దగ్గరికి వచ్చి కేటీఆర్ తమని వేధిస్తున్నాడు అన్నాడు చెప్పుకున్నారు,” పెద్ద బిల్డప్ కూడా ఇచ్చారు జీవిత. బీజేపీ తరఫున పోటీకోసం అలా హడావిడి చేశారు.

కానీ, ఇప్పుడు ఆమెకి టికెట్ ఇవ్వలేదు బీజేపీ. ఆమెకే కాదు సినిమా హీరోయిన్లకు ఎవ్వరికీ ఈసారి బీజేపీ తరఫున సీట్లు ఇవ్వలేదు.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్లామర్ బాగా ఉంటుంది అనుకుంటే చివరికి ఒక్క పాపులర్ నటుడు, నటి పోటీ చెయ్యడం లేదు. జయసుధ కూడా చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. జయప్రద కూడా పోటీ చేస్తారనే మాట వినబడింది. విజయశాంతి పోటీకి దిగొద్దని అనుకున్నారో, మరో కారణమో తెలియదు కానీ ఆమె కూడా సైలెంట్ అయ్యారు.

ప్రస్తుతం పోటీలో ఉన్న నటుడు ఎవరు అంటే బాబూమోహన్. ఆయన బీజేపీ నుంచి ఎలాగోలా టికెట్ సంపాదించుకోగలిగారు.

More

Related Stories