‘కాంతార చాప్టర్ 1’ వెయ్యి కోట్లు?

Kantara Chapter 1

‘కాంతార చాప్టర్ 1’ సినిమా మొదటి వారం బాగా ఆడింది. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో బాగా ఆడింది. ఆ తర్వాత కన్నడంలో మాత్రం నిలబడి తెలుగు, తమిళ్ లో జారుకొంది. హిందీలో నెమ్మదిగా రన్ కంటిన్యూ అవుతూ హిందీ వెర్షన్ 200 కోట్ల మార్క్ అందుకొంది. ఓవరాల్ గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ముందు అనుకున్నట్లు 1000 కోట్లని రీచ్ కావడం కష్టం.

ఐతే, ఈ సినిమా నిర్మాతలు మాత్రం 1000 కోట్ల టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతి వీకెండ్ భారీ కలెక్షన్లతో కూడిన పోస్టర్లను విడుదల చేస్తున్నారు. పోయిన వారం 690 కోట్ల ప్లస్ పోస్టర్ ని విడుదల చేస్తే ఈ వారం 765 కోట్ల పోస్టర్ ని రిలీజ్ చేశారు.

మంచి హిట్టైన సినిమాకే ఇలా ఎక్కువ మొత్తం కలెక్షన్లను కలిపి నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ పోస్టర్లను విడుదల చేస్తోంది. దాంతో, 1000 కోట్ల పోస్టర్ కూడా తప్పకుండా వస్తుందేమో అనే మాట వినిపిస్తోంది.

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు కేవలం “కేజీఎఫ్ 2” సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మార్క్ దాటింది. ఆ సినిమా ఏకంగా 1200 కోట్ల వరకు జెన్యూన్ గా కలెక్ట్ చేసింది. ఐతే, ఈ ‘కాంతార చాప్టర్ 1’ని కూడా 1000 కోట్ల క్లబ్ లో చేర్పించాలని నిర్మాణ సంస్థ టార్గెట్ పెట్టుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

More

 

Related Stories