
“కాంతార” సినిమా ఒక సంచలనం. ఆ సినిమా బడ్జెట్ 40 కోట్లలోపు. థియేటర్ల ద్వారా వచ్చింది 400 కోట్లు. అందుకే, ఇప్పుడు ఆ చిత్రం ప్రీక్వెల్… “కాంతార చాఫ్టర్ 1” (Kantara: Chapter 1) విడుదలపై అందరిలో ఆసక్తి ఉంది. ఐతే, ఎంత పెద్ద చిత్రానికి అయినా మంచి పబ్లిసిటీ కావాలి.
కానీ ఈ చిత్రం మేకర్స్ మాత్రం చాలా లేట్ గా పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఈ నెల 22న ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ తోనే పబ్లిసిటీ స్టార్ట్. సినిమానేమో అక్టోబర్ 2న విడుదల అవుతుంది. ఐతే, ఈ పదిరోజుల పబ్లిసిటీ చాలని అంటోంది ఈ టీం. సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ప్రమోషన్ అవసరం లేదనేది ఈ టీం ధీమా.
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. “కాంతార” చిత్రం కథ కన్నా ముందు జరిగే పరిణామాలతో ఈ సినిమా రూపొందింది. అంటే ప్రీక్వెల్.
“కాంతార” తక్కువ బడ్జెట్ తో తీశారు. కానీ ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించారు. విజువల్స్ చాలా భారీగా ఉంటాయట.





