లక్ష్మీ కామెంట్లకు ట్రోలింగ్ సెగ!

- Advertisement -
Lakshmi

“ఇక్కడ తెలుగు అమ్మాయిలకు విలువ లేదు. టాలెంట్ ఉన్నా తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు తెలుగు ఫిలిం మేకర్స్.” – ఇది . లక్ష్మీ ప్రసన్న తాజా స్టేట్ మెంట్. అలాగే, తాను హాలీవుడ్ లోనే కంటిన్యూ అయి ఉంటే బాగుండేది అన్నట్లుగా ఆమె మాట్లాడడం, అది వైరల్ కావడం చకాచకా జరిగిపోయింది.

లక్ష్మీ ప్రసన్న ఒకట్రెండు హాలీవుడ్ చిత్రాల్లో, వెబ్ సిరీస్ లో చిన్న పాత్రలు పోషించారు. ఐతే, తెలుగు అమ్మాయిలకు ఇక్కడివాళ్ళు అవకాశాలు ఇవ్వడం లేదని ఆమె నిందిస్తున్న తీరుకి మద్దతు రావడం లేదు. పైగా ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతోంది.

“మీ ఇంట్లోనే మీ సోదరుడు వరుసగా సినిమాలు తీస్తున్నారు. పైగా మంచు విష్ణు “మా” సంఘానికి అధ్యక్షుడు. తెలుగు అమ్మాయిలకు అవకాశాల గురించి మీ బ్రదర్ ని నిలదీయొచ్చు కదా,” అని జనాలు ట్రోల్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్, సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ వంటి సినిమాలు తీసే బదులు బిందు మాధవి, నిహారిక వంటి తెలుగు అమ్మాయిలతో మంచు విష్ణు సినిమాలు తీయొచ్చు కదా. అలా మీ బ్రదర్ కి చెప్పొచ్చు కదా అని ఆమెని నిలదీసిఫై చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

More

Related Stories