చెలిగా వెళ్తే చెల్లిని చేశాడట!

Ajith and Maheswari

హీరో అజిత్ కుమార్ అంటే ఒకప్పుడు అమ్మాయిలు బాగా ఇష్టపడేవారు. ఇప్పుడు అంటే అతను పక్కా మాస్ హీరో అయిపోయాడు కానీ కెరీర్ ప్రారంభంలో హ్యాండ్సమ్ గా ఉండేవాడు. రొమాంటిక్ చిత్రాలు చేసేవాడు. “ప్రేమ పుస్తకం”, “ప్రేమలేఖ,” “వాలి”, “ప్రియురాలు పిలిచే” వంటి సినిమాలతో అప్పట్లో అమ్మాయిల మనసు దోచుకున్నాడు.

హీరోయిన్లు కూడా అతన్ని బాగా ఇష్టపడేవారు. హీరోయిన్ హీరా ప్రేమించింది. కానీ అతను మరో హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి కూడా అజిత్ ని బాగా ఇష్టపడేదంట.

అతను నా క్రష్ అని తాజాగా మహేశ్వరి తెలిపింది. “గులాబీ” సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మహేశ్వరి తాజాగా జగపతిబాబు నిర్వహిస్తోన్న “జయమ్ము నిశ్చయమ్మురా” టాక్ షోకి ఆమెని పిలిచారు.

“నేను అజిత్ ఒక సినిమాలో కలిసి నటించాం. సినిమా షూటింగ్ అయ్యాక నాకు ఆయనంటే ఉన్న క్రష్ గురించి చెప్దామనుకున్నాను. కానీ చివరి రోజు నువ్వు నాకు చెల్లిలాంటిదానివి అని నా మనసు ఇరగొట్టాడు,” అని తెలిపింది.

More

 

Related Stories