ఈ సినిమా ఫలితం ముఖ్యం!

మాళవిక నాయర్ చాలా మంచి నటి. ప్రతిభ ఉంది. కానీ ఆమెకి లక్ లేదు. చాలా సినిమాల్లో చేసినా సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. సినిమా హీరోయిన్లలో చదువుకుంటూ నటించిన వారిలో ఒకరు ఈ భామ.
తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి అని భావించి తన సొంత రాష్ట్రం కేరళ వదిలి హైదరాబాద్ లో కాలేజ్ లో చేరి చదువుకుంటూ సినిమాల్లో నటించింది. చదువు పూర్తి అయింది. కానీ ఇప్పుడు ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదు.
మొదట్లో “ఎవడే సుబ్రహ్మణ్యం”, “మహానటి”, “విజేత”, “కల్యాణ వైభోగమే”, “థాంక్యూ”, “ట్యాక్సీవాలా” ఇలా పలు సినిమాల్లో చేసింది. రీసెంట్ గా “కల్కి 2898 AD”లో చిన్న పాత్ర పోషించింది. ఇప్పుడు శర్వానంద్ సరసన “బైకర్”లో నటించింది. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమాతో ఆమె ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి అవుతాయి. ఇది హిట్ అయితే ఆమెకి మరిన్ని ఛాన్సులు రావొచ్చు. లేదంటే నిరీక్షణ తప్పదు.
మాళవిక నాయర్ స్కాట్లాండ్లో పీజీ కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం “బైకర్” సినిమా ఫలితం గురించి వెయిట్ చేస్తోంది.