సారీ చెప్పనంటున్న మన్సూర్!

- Advertisement -
Trisha and Mansoor Ali Khan


నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ దేశమంతా దుమారం రేపాయి. “త్రిషని బెడ్ రూమ్ కి తీసుకెళ్లే సీను ఉంటుంది అనుకున్నా. కానీ ‘లియో’లో అలాంటిది లేదు. కుష్బూ, రోజా.. ఇలా ఎందరో హీరోయిన్లను (రేప్) చేశా సినిమాల్లో… త్రిషని కనీసం బెడ్ రూమ్ కి ఎత్తుకెళ్లే ఛాన్స్ దక్కలేదు,” అంటూ మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పై జాతీయ మహిళా కమీషన్ సైతం స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

మరోవైపు, తమిళ నటీనటులకి చెందిన నడిగర్ సంఘం మన్సూర్ అలీ ఖాన్ వెంటనే త్రిషకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే బహిష్కరిస్తామంటూ పేర్కొంది.

ఐతే, మన్సూర్ అలీ ఖాన్ మాత్రం నడిగర్ సంఘం తన వర్షన్ వినకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది అని అంటున్నారు. తాను క్షమాపణ చెప్పేది లేదు అంటున్నారు ఆయన. తన మాటలను వక్రీకరించారు అనేది అతని మాట.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తాజాగా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

 

More

Related Stories