ఎప్పటినుంచో ఆయనంటే ఇష్టం: మీనాక్షి

- Advertisement -
Meenakshi Chaudhary


మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టేసింది. “గుంటూరు కారం” సినిమాలో ఆమె రెండో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. ఈ భామకి ఇది చాలా పెద్ద అవకాశం.

“గుంటూరు కారం”లో శ్రీలీల మెయిన్ హీరోయిన్. మీనాక్షి రెండో హీరోయిన్. ఈ సినిమా పెద్ద హిట్ అయితే ఆమె కెరీర్ మొత్తం మలుపు తిరుగుతుంది. అందుకే, ఆమె చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు, తాను మహేష్ బాబుకి అభిమానిని అని చెప్తోంది.

“మహేష్ బాబు సరసన నటించే అవకాశం వచ్చింది కాబట్టి ఆయనని పొగుడుతున్నాను అనుకుంటే పొరపాటు. మహేష్ బాబు అంటే ఎప్పటి నుంచో ఇష్టం. ఆయనకి నేను ఫ్యాన్. ఒక అభిమానికి తన అభిమాన హీరోతో నటించే అవకాశం వస్తే ఎంత మజా? అందుకే, ఐ యామ్ సో హ్యాపీ,” అంటూ గడగడా చెప్పింది.

ALSO CHECK PHOTOS: Meenakshi Chaudhary as a traditional Telugu girl

More

Related Stories