నా జీవితం నా ఇష్టం: ప్రియమణి

Priyamani

హీరోయిన్ ప్రియమణికి డేరింగ్ ఎక్కువే. సినిమాల ఎంపికలోనే కాదు పెళ్లి, ప్రేమ వంటి విషయాల్లో కూడా తనకి నచ్చిన విధంగానే నిర్ణయాలు తీసుకొంది. ఆమెకి పెళ్లి అయి ఇప్పటికే ఆరేళ్ళు పూర్తి అయింది. ఇప్పుడు ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటోంది ఈ భామ.

ఆమె ముస్తఫా అనే ముస్లిం వ్యక్తిని పెళ్లాడింది. 2017లో వీరి వివాహం జరిగింది. పైగా అతనికి అది రెండో పెళ్లి. ప్రియమణి పెళ్లి చేసుకునే టైంకి అతను తన మొదటి భార్యకి విడాకులు కూడా ఇవ్వలేదు. దాంతో, అప్పట్లో ఆమెని చాలా మంది విమర్శించారు. ఇక ఆన్ లైన్ లో బాగా ట్రోలింగ్ చేశారట.

“అప్పుడే కాదు ఇప్పుడు కూడా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. కానీ నేను ఎప్పుడూ ఎవరి కామెంట్స్ ని పట్టించుకోను. నా జీవితం నా ఇష్టం అనేది నా పాలసీ. నేను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు,” అని చెప్తోంది ప్రియమణి.

ఆమె ఇటీవల నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించారు. కాకపోతే ఆ సినిమా ఆడలేదు. ఇక షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ చిత్రంలో కూడా ఆమె ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. 39 ఏళ్ల ఈ సుందరి అన్ని రకాల పాత్రలు పోషిస్తాను అంటోంది.

Advertisement
 

More

Related Stories