డిసెంబర్ లో వారి పెళ్లి, వీరి పెళ్లి

Samantha and Naga Chaitanya's weddings

నాగ చైతన్య, శోభిత గతేడాది పెళ్లి చేసుకున్నారు. వారి మొదటి వివాహ వార్షికోత్సవ సమయానికి నేడు సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. అటు నాగ చైతన్య, ఇటు సమంత, ఇద్దరూ రెండో పెళ్లిళ్లు ఏడాది గ్యాప్ లో డిసెంబర్ మొదటివారంలోనే పెళ్లి చేసుకోవడం విశేషం.

నాగ చైతన్య, శోభిత పెళ్లి 2024 డిసెంబర్ 4న జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి జరిగింది.

ఇక ఈ రోజు అంటే డిసెంబర్ 1, 2025న సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగింది. కోయంబత్తూర్ లోని లింగ భైరవ అనే గుడిలో “భూత శుద్ధి” వేడుక పద్దతిలో జరిగింది.

నాగ చైతన్య, సమంత మొదట 2017లో పెళ్లి చేసుకున్నారు. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో గ్రాండ్ జరిగింది వారి పెళ్లి. మూడున్నర ఏళ్ల కాపురం తర్వాత విడిపోయారు. 2022లో వీరి డివోర్స్ లీగల్ గా ఖరారు అయింది. అదే సమయంలో నాగ చైతన్య, శోభిత డేటింగ్ షురూ అయింది. రెండేళ్ల తర్వాత డిసెంబర్ 4, 2024న పెళ్లి చేసుకున్నారు.

రాజ్, సమంత ఇద్దరూ కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి నేడు (డిసెంబర్ 1, 2025) పెళ్లి చేసుకున్నారు.

More

 

Related Stories