నాని సినిమా థియేటర్లలోకి

V Movie

నాని, సుధీర్ బాబు నటించిన “వి” డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. సినిమాకి పూర్తిగా నెగటివ్ టాక్ వచ్చింది. ఐతే, నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాని ఓటిటికి అమ్మి మంచి లాభాలు పొందారు. ఈ సినిమాని ఇప్పుడు థియేటర్లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది టీం.

ఎందుకంటే… ఇప్పటికే థియేటర్లు, మల్టీప్లెక్స్ లు హైద్రాబాద్లో తెరుచుకున్నాయి. పూర్తిగా సింగిల్ థియేటర్లు ఏపీ, తెలంగాణాలో మొత్తంగా స్టార్ట్ చెయ్యాలంటే… ప్రదర్శించేందుకు సినిమాలు కావాలి. కొత్త సినిమాగా “సోలో బ్రతుకే సో బెటర్” డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. దాంతో పాటు మరికొన్ని సినిమాలను థియేటర్లోకి తెచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.

“వి” సినిమా ఈ నెలలోనే థియేటర్లోకి వస్తుంది.

Advertisement
 

More

Related Stories