వాళ్ళు రిజెక్ట్ చేస్తే రకుల్ కొచ్చిందిట

Rakul and Ananya Panday


కండోమ్ నాణ్యతని పరీక్షించే వారు కూడా ఉంటారట. ఆ ఉద్యోగం చేసేవారి కథతో బాలీవుడ్ లో ఒక కామెడీ మూవీ తెరకెక్కనుంది. ‘కండోమ్ టెస్టర్’ పాత్రని రకుల్ పోషించనుంది ఈ సినిమాలో. ఐతే, ఈ పాత్రకి ఆమె మొదటి ఆప్సన్ కాదంట.

మొదట ఈ రోల్ ని నేటి తరానికి చెందిన యంగ్ హీరోయిన్ తో చేయించాలనుకున్నారు మేకర్స్. జాన్వీ కపూర్, అనన్య పాండే, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్… వారి మొదటి చాయిస్. అయితే, ఈ పాత్ర చేసేందుకు ముగ్గురూ ఒప్పుకోలేదు. వాళ్ళు రిజెక్ట్ చేయడంతో రకుల్ వల్లో వాలింది ఈ మూవీ. ఆమె వెంటనే ఒప్పుకొంది.

రకుల్ కి ఇప్పుడు తెలుగులో కన్నా హిందీలోనే అవకాశాలు వస్తున్నాయి. ఆమె వచ్చిన ఏ ఆఫర్ ని వదులుకోవట్లేదు.

Also Read: ‘సెక్స్’క్యూటివ్ గా రకుల్

More

Related Stories