ఓడిపోతే రాజీనామా చేస్తారా?: నరేష్

“మా” ఎన్నికలు ముగిసినా విమర్శలు, కౌంటర్లు ఆగలేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ‘మా’ కృష్ణుడు నరేష్ స్పందించారు. విష్ణు వెనుకాల కృష్ణుడిలా ఉండి పనిచేసిన నరేష్ తనదైన శైలిలో పంచ్ లు విసిరారు.

“మోదీ గెలిచాడని కాంగ్రెస్ దేశం వదిలిపోయిందా?” అని సూటిగా ప్రశ్నించారు నరేష్. “మా” ఒక సేవా సంస్థ, తామంతా సేవ చేస్తున్నామని సెల్ఫ్ డబ్బా కూడా కొట్టారు. అలాగే విష్ణుని డిస్టర్బ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు నరేష్.

“విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే ఊరుకోను. ఆయన పని ఆయన్ని చేసుకోనివ్వండి. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు? మోదీ గెలిచారని కాంగ్రెస్‌ దేశం వదిలిపోయిందా? ‘మా’ సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలయ్యాక ఇలాంటి రాద్ధాంతం ఎందుకు చెప్పండి?,” అని నరేశ్‌ ప్రకాష్ రాజ్ వర్గాన్ని ప్రశ్నించారు.

నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది.

 

More

Related Stories