నయనతార చిత్రం హాట్ స్టార్ లోనే

Netrikann


అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది హాట్ స్టార్. ఇప్పటికే తెలుగులో నితిన్ నటించిన ‘మాస్ట్రో’ సినిమా హక్కులను పొందింది. వచ్చే నెలలో డైరెక్ట్ గా హాట్ స్టార్ లో విడుదల కానుంది ‘మాస్ట్రో’. ఇప్పుడు నయనతార మూవీ హక్కులని పొందింది.

నయనతార తమిళంలో నటించిన ‘నెట్రికన్’ అనే థ్రిల్లర్ ని హాట్ స్టార్ డైరెక్ట్ గా విడుదల చెయ్యనుంది. థియేటర్లలో విడుదల కాదు. గతేడాది, నయనతార కీలక పాత్ర పోషించిన ‘అమ్మోరు తల్లి’ (Mookuthi Amman) కూడా హాట్ స్టార్ లోనే డైరెక్ట్ గా విడుదలైంది.

సిద్దార్థ్ హీరోగా గృహం అనే సినిమా డైరెక్ట్ చేసిన మిలింద్ రావు ఈ సినిమాకి దర్శకుడు. ‘నెట్రికన్’ అంటే మూడో కన్ను. ఈ సినిమాలో నయనతార అంధురాలిగా నటించారు. చూడలేకపోయినా ఆమె అన్ని పనులు చేస్తుంది. ఫైట్స్ కూడా చూస్తుంది. ఎలా? మూడో కన్ను ఉందా? అదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్.

నయనతార కాబోయే భర్త విగ్నేష్ శివన్ ఈ సినిమాకి నిర్మాత. అంటే నయనతారకి హోమ్ ప్రొడక్షన్.

 

More

Related Stories