రాజశ్యామల పూజ చేసిన నిధి

- Advertisement -

నిధి అగర్వాల్ కి అన్నీ ఉన్నాయి. కానీ ఏవీ కలిసి రావట్లేదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ కొత్త సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అంత హై ప్రొఫైల్ సినిమాలు తన ఖాతాలో ఉన్నా రావాల్సిన గుర్తింపు రావట్లేదు. ఆ పెద్ద సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియదు.

అందుకే విఘ్నాలు తొలగి జెట్ స్పీడ్ గా తన కెరీర్ దూసుకుపోవాలని కోరుకుంటూ ఆమె రాజ శ్యామల పూజ నిర్వహించింది.

“ప్రముఖ టాలీవుడ్ మరియు బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో రాజ శ్యామల పూజ,” అంటూ వేణు స్వామి పరాంకుశం తన ఫేసుబుక్ లో వీడియో పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలకు పూజలు చెయ్యడంలో పేరొందిన వేణు స్వామి ఇలా నిధి అగర్వాల్ వీడియోని కూడా పోస్ట్ చేశారు.

నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటిస్తోంది. మూడేళ్ళుగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. అలాగే, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన నిధి నటిస్తోంది. కానీ ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సైలెంట్ గా షూటింగ్ సాగుతోంది. ఇది ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు.

ఇలా కెరీర్ మెల్లగా సాగుతోంది. పెద్ద సినిమాలున్నా హంగామా లేదు. అందుకే ఈ పూజలు చేసినట్లు కనిపిస్తోంది.

 

More

Related Stories