
పవన్ కళ్యాణ్ అటు రాజకీయ యాత్రలు చేస్తూనే ఇటు సినిమాలు ఒప్పుకున్నారు. అలా షూటింగ్ చేసినవే “హరి హర వీర మల్లు”, “ఓజి”, కొంతభాగం “ఉస్తాద్ భగత్ సింగ్”. కానీ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు అన్ని సినిమాలూ ఆపేసి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
గెలిచిన ఏడాది తర్వాతే మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. అలా “హరి హర వీర మల్లు” పూర్తి చేసి విడుదల చేశారు. అది ఘోరంగా పరాజయం పాలు అయింది. అలాగే ఆ సినిమాలో చాలా చోట్లా పవన్ కళ్యాణ్ లుక్స్ బాలేవు. ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ముఖం అంతా పాడు అయింది, మునుపటి చార్మ్ పోయింది, వయసు కనబడుతోంది అనే మాటలు వినిపించాయి.
విచిత్రంగా ఆ సినిమాతో పాటే “ఓజీ” సినిమాలో నటించారు. కానీ “ఓజీ”లో పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయాయి అని అభిమానులు అంటున్నారు.
విడుదలైన టీజర్లో కానీ, రెండు పాటల్లో కానీ పవన్ కళ్యాణ్ బాగున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక విడుదలైన రెండు పాటలు బాగుండడం, అందులో పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటుతోంది.
ఈ క్రెడిట్ అంతా సుజీత్ కే దక్కుతుంది అని అంటున్నారు అభిమానులు. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చెయ్యడంలో చాలా శ్రద్ద తీసుకున్నాడు అని చెప్తున్నారు. “హరి హర వీర మల్లు” విషయంలో మొదట పనిచేసిన దర్శకుడు క్రిష్ కానీ, ఆ తర్వాత సినిమాని పూర్తి చేసిన జ్యోతికృష్ణ కానీ పవన్ కళ్యాణ్ ని సరిగా ప్రెజెంట్ చెయ్యలేదు.





