
ఒకప్పుడు సల్మాన్ ఖాన్ కి ఎప్పుడూ ఒకే ప్రశ్న ఎదురయ్యేది – పెళ్లి ఎప్పుడు? ఆయన 50 దాటిన తర్వాత ఆ ప్రశ్న మీడియా వెయ్యడం మానేసింది. ఇప్పుడు ప్రభాస్ కి అదే పరిస్థితి. ఏ ఇంటర్వ్యూలో అయినా, ఎక్కడికి వెళ్లినా అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది.
ప్రభాస్ కిప్పుడు 42. సో.. మరికొన్నాళ్ళు ఇలాగే ఉంటుంది. “అందరూ సదుద్దేశంతోనే అడుగుతారు కాబట్టి వాళ్ళ ప్రశ్న చిరాకు పెట్టదు. కాకపోతే, నా దగ్గర సమాధానమే లేదు,” అని తాజాగా తన పెళ్లి గురించి స్పందించారు ప్రభాస్.
మరి అస్సలు పెళ్లి చేసుకోరా? “పెళ్లి ఎప్పుడు అంటే నాకు జవాబు తెలిసినప్పుడు దాచుకోను. మీడియా ముందు దాయను. చెప్పే పెళ్లి చేసుకుంటా. కానీ ఆ జవాబే (వధువు) రావట్లేదు ఇంకా,” అని అన్నారు ప్రభాస్.
సో, ప్రభాస్ పెళ్లి మేటర్ అది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘స్పిరిట్’ చిత్రాలు ఒప్పుకున్నారు ప్రభాస్. ‘ఆదిపురుష్’, ‘సలార్’ వచ్చే ఏడాది విడుదలవుతాయి.