పూతరేకుల గిఫ్టులిస్తోన్న ప్రభాస్!

Bhagya Shree

‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీకి స్వీట్లు అంటే ఇష్టం. ఆమె చాలా స్లిమ్ గా ఉంటారు. 50 ప్లస్ ఏజ్ లో కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు. స్వీట్లు తిని కూడా బాడీని అలా మెయింటైన్ చెయ్యడం అంటే గ్రేట్.

తాజాగా ఆమె హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో జరుగుతోన్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ లో పాల్గొనేందుకు గత గురువారం వచ్చిన ఆమెకి మధురమైన స్వాగతం లభించింది. వెల్లంకి స్వీట్ షాప్ నుంచి తెప్పించిన పూతరేకుల స్వీట్ డబ్బాలను గిఫ్ట్ బాక్స్ లో ఆమెకి పంపించారు ప్రభాస్. లాక్డౌన్ తర్వాత షూటింగ్ కి వచ్చిన ఆమెకి అలా వెల్కమ్ దక్కింది. ప్రభాస్ పద్దతికి మురిసిపోయిన భాగ్యశ్రీ … తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అతనికి థాంక్స్ చెప్పారు.

‘రాధేశ్యామ్’లో ఆమె ప్రభాస్ కి తల్లిగా నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమా షూటింగ్ ఈ నెలతో పూర్తి అవుతుంది. ఒక సాంగ్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి అయినట్లే.

ప్రభాస్ నటించే సినిమాల్లో ఫుడ్ ఆరెంజ్ మెంట్స్ అదిరిపోతాయని అంటారు యాక్టర్స్. తన ఇంటి నుంచి వచ్చిన రకరకల వంటకాలను తోటి నటీనటులకు సర్వ్ చేయిస్తారు ప్రభాస్. ప్రభాస్ ఆతిథ్యానికి ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే.

Advertisement
 

More

Related Stories