ప్రభాస్ సినిమాలన్నీ హైదరాబాద్ లోనే!

- Advertisement -
Salaar

ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అన్ని భారీ చిత్రాలే. ‘రాధేశ్యామ్’ పూర్తయింది. రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఒకటి ‘సలార్’, రెండోది ‘ఆదిపురుష్’. ‘సలార్’ సినిమాని ఇప్పటికే రామగుండం, హైదరాబాద్ లలో చిత్రికరీంచారు. తర్వాత కర్ణాటకలో, ముంబైలో, రాజస్థాన్లో తీయాలనుకుంటున్నారు.

అలాగే, ‘ఆదిపురుష్’ సినిమాని మొత్తంగా ముంబైలో వేసిన స్టూడియోలోనే తీద్దామని ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అంతా తారుమారు అయింది. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఈ రెండు సినిమాలని పూర్తి చేద్దామనుకుంటున్నారట. ‘ఆదిపురుష్’ టీం రామోజీ ఫిలిం సిటీ వారితో చర్చలు జరుపుతోంది. కోవిడ్ ప్రోటోకాల్ అన్ని పాటిస్తూ సేఫ్ గా షూటింగ్ ఎలా చెయ్యగలమో ఫిలిం సిటీ టీంని అడిగి తెలుసుకుంటున్నారు.

ఇక ‘సలార్’ షూటింగ్ కూడా మరి కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో వేసిన సెట్ లోనే తీద్దామనుకుంటున్నారట. పరిస్థితులన్నీ కుదురుకున్న తర్వాతే వేరే రాష్ట్రాల్లో షూటింగ్ చేస్తారు.

More

Related Stories