ప్రభాస్ 25వ చిత్రం సాధ్యమేనా?

Prabhas

ప్రభాస్ ఇప్పటికే తన 25వ చిత్రాన్ని ప్రకటించారు. “అర్జున్ రెడ్డి” దర్శకుడు సందీప్ వంగా డైరెక్షన్ లో ఉంటుందని చెప్పారు. ఆ సినిమాకి ‘స్పిరిట్’ అనే టైటిల్ కూడా ఖరారు అయింది. ఐతే, ఈ 25వ చిత్రం ఇప్పట్లో ఉంటుందా అన్న డౌట్స్ మొదలయ్యాయి.

దర్శకుడు సందీప్ వంగా ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆయన తదుపరి చిత్రం…యానిమల్. బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్ హీరో. పరిణితి చోప్రా హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. వచ్చే ఏడాది మొదలవుతుంది. లేటెస్ట్ గా “యానిమల్” చిత్రాన్ని 2023 ఆగస్ట్ 11న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

“యానిమల్” సినిమానే 2023లో రిలీజ్ చేస్తే… మరి ప్రభాస్, వంగా కాంబినేషన్ లో రూపొందే “స్పిరిట్” ఎప్పుడు మొదలు కావాలి? ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? చూస్తేంటే ఇది 2025లో వచ్చేలా ఉంది. అప్పటికి ఎన్ని మార్పులు జరుగుతాయో?

ప్రభాస్ హాడావిడగా సినిమాలైతే ప్రకటించారు, దూకుడుగా షూటింగులు ఐతే చేస్తున్నారు కానీ విడుదల తేదీల విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికే సంక్రాంతికి రానున్న ‘రాధేశ్యామ్’ పబ్లిసిటీ సరిగా లేదని అభిమానులు గోల పెడుతున్నారు.

Advertisement
 

More

Related Stories