
విడుదలకు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించడం సాధారణం అయిపోయింది. రాత్రి 9 గంటలకు, 12 గంటలకో, తెల్లారుఝామున 4 గంటలకు ఇలా షోలు నిర్వహించేవారు ఇప్పటివరకు. “పుష్ప 2” సినిమా రాత్రి 11 గంటలకు ప్రీమియర్ షోలు పెట్టారు. “ఓజీ” సినిమాకి రాత్రి 9 గంటలకే షోలు వేశారు.
ఐతే, ఇకపై మధ్యాహ్నం నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యేలా ఉన్నాయి.
బాహుబలి రెండు భాగాలను “బాహుబలి ఎపిక్” పేరుతో సినిమాని విడుదల చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 31న) విడుదల కానుంది. కానీ సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలు మాత్రం గురువారం సాయంత్రం (అక్టోబర్ 30) 5 గంటలకే మొదలవుతున్నాయి. 5, 5.30కే మొదటి ప్రీమియర్ షో హైదరాబాద్ లో పడనుంది. ఆ తర్వాత అన్ని నగరాల్లో, మరిన్ని షోలు రన్ అవుతాయి. సాధారణ జనం ఎవరైనా ఈ టికెట్లను బుక్ చేసుకొని చూడొచ్చు.
అలాగే రవితేజ హీరోగా రూపొందిన “మాస్ జాతర” శనివారం (నవంబర్ 1) విడుదల కానుంది. కానీ ఈ శుక్రవారం (అక్టోబర్ 31న) నాడు 5.30 గంటలకే మొదటి పెయిడ్ ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది.
ఇలా ఈ రెండు సినిమాలు – “బాహుబలి ఎపిక్” “మాస్ జాతర” – కొత్త పద్దతికి శ్రీకారం చుట్టాయి.





