
సిద్ధు జొన్నలగడ్డ ఇటీవల నటించిన “జాక్” ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు కొత్త చిత్రం కోసం. చాలా కాలంగా “తెలుసుకదా” అనే సినిమాలో నటిస్తున్నాడు. “జాక్” ఫ్లాప్ తర్వాత మరిన్ని జాగ్రత్తల కోసం “తెలుసు కదా”లో కొన్ని మార్పులు చేయించాడు. మొత్తానికి షూటింగ్ ని తుది దశకు చేర్చారు ఇప్పుడు.
తాజాగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రాశి ఖన్నా తన భాగాన్ని పూర్తి చేస్తోంది. రాశి ఖన్నాకి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది.
“కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు ఉంటాయి… ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీంకి కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్‌గా ఉంటుంది,” అని రాశి ఖన్నా రాసుకొంది.
ఇందులో రాశీ ఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి కూడా నటిస్తోంది.
ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్నారు. “తెలుసు కదా” ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.





