రాధేశ్యామ్ ప్రొమోషన్ మరిచిపోయారా?

Prabhas as Vikramaditya


ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. అంటే సరిగ్గా రెండు నెలల టైముంది రిలీజ్ కి. కానీ ఈ టీం సినిమా ప్రమోషన్ లో వెనుకబడింది. ఇప్పటివరకు ఒక్క పాట బయటికి రాలేదు. సినిమా టీం కూడా ఆ విషయంలో హడావిడి చెయ్యడం లేదు.

జనవరి 7న విడుదల కానున్న రాజమౌళి మూవీ “ఆర్ ఆర్ ఆర్”, డిసెంబర్ లో వస్తున్న “పుష్ప”, “అఖండ” సినిమాలు పబ్లిసిటీ పరంగా దూసుకుపోతున్నాయి. కానీ ‘రాధేశ్యామ్’ ఆ విషయాన్నీ మరిచిపోయిందా అనిపిస్తోంది. ఇప్పుడు సినిమాల ఓపెనింగ్స్ కి పాటలు కీలకంగా మారాయి. పాటల ప్రొమోషన్, టీజర్లు, ట్రైలర్లు ముఖ్యం. కానీ పాటల విషయంలో హడావిడి లేదు.

ప్రభాస్ పేరు చాలు జనం ఆటోమేటిక్ గా వస్తారనే ధీమానా? లేక ముంబై టీం చేస్తారని ఇక్కడ, ఇక్కడోల్లు చూసుకుంటారని అక్కడోల్లు కన్ఫ్యూజన్ లో ఉన్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఈ సినిమాని హిందీ హక్కులను టీ సిరీస్ తీసుకొంది. హిందీ మార్కెట్ పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.

రాధాకృష్ణ కుమార్ అనే దర్శకుడు తీస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజ హెగ్డే హీరోయిన్. ప్రభాస్ కున్న క్రేజ్ వేరు. ఐతే, ఎంత పెద్ద హీరోకైనా ప్రమోషన్ మాత్రం తప్పదు.

Advertisement
 

More

Related Stories