రాజమౌళికి అదే పెద్ద సవాల్!

- Advertisement -
Rajamouli


RRR వాయిదా పడింది. మళ్ళీ విడుదల ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేరు. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ సినిమాని వాయిదా వేశారు రాజమౌళి. ఇంకో కొత్త డేట్ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మరి కొత్త డేట్ ఫిక్స్ చేస్తే, ఆ డేట్ ఖఛ్చితంగా వస్తామని జనాలని నమ్మించేది ఎలా? ఇదే ఇప్పుడు రాజమౌళి ముందున్న పెద్ద సవాల్.

తెలుగుసినిమా.కామ్ కి తెలిసిన సమాచారం ప్రకారం రాజమౌళి తాజా పరిణామాల నేపథ్యంలో డల్ అయ్యారని టాక్. జనవరి 7 నుంచి సినిమాని వాయిదా వెయ్యాల్సి వస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. విడుదల చేద్దామనే ఆయన ప్రొమోషన్ కి ఊపు తెచ్చారు. కానీ పరిస్థితులు అలా మారడంతో వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది.

‘RRR’ విడుదల విషయంలో రాజమౌళి ఇంతకుముందు ఏకపక్షంగా ప్రవర్తించారు. ఈసారి, ఇండస్ట్రీలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తున్నారట. తనపై ఇండస్ట్రీలో బ్యాడ్ ప్రచారం జరిగింది అని ఆయన ఫీల్ అవుతున్నారు రాజమౌళి.

“RRR” విడుదలయిన తర్వాతే మహేష్ బాబు సినిమా గురించి ఆలోచిస్తారు. ఈ ఏడాది మొదలుపెట్టాలా లేక వచ్చే ఏడాదా అన్నది డిసైడ్ కావాలి.

 

More

Related Stories