ఆర్చరీ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌

TeluguCinema 18 Sep 2025
Ram Charan

భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌)కు రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యారు. రామ్ చరణ్ తమ అధికారిక అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌(ఏఏఐ) గురువారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా అక్టోబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు మొదటి ఏపీఎల్‌ జరుగనుంది.

ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా జరుగబోతున్న టోర్నీలో ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోటుకు చేర్చనుంది. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్నొన్నారు.

“ఆర్చరీ అనే క్రీడ..క్రమశిక్షణతో కూడుకున్నది. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ తో అనుబంధం కావడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను,” అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం “పెద్ది” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

TeluguCinema

View all posts

Recent News